G.K.క్విజ్-9

1. దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ పొందిన ఇద్దరు 'అక్కినేని' లు ఎవరు?
2. మల్లీశ్వరి, గృహలక్ష్మి మొదలగు చిత్రాల దర్శకుడు B.N.రెడ్డి పూర్తి పేరేమి?
3. రాష్ట్రపతికి ఏ బిల్లుల విషయంలో వీటో అధకారం లేదు?
4. గరీబీ హఠావో అను నినాదంతో ప్రారంభంచిన పంచవర్ష ప్రణాళిక ఏది?
5. ది డార్క్ రూమ్ గ్రంథకర్త ఎవరు?
6. లోకమాన్య అను బిరుదు ఎవరికి కలదు?
7. విజయవిలాసము కావ్యకర్త ఎవరు?
8. అధిక రక్తపోటు నివారణకు వాడు ఆయుర్వేద మందు ఏది?
9. పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి ఏది?
10. కింగ్ ఆఫ్ కెమికల్స్ అని దేనిని అందురు?
11. ఆడియో టేపులు తయారు చేయుటకు ఉపయోగించే పదార్థం ఏది?
12. త్రాచుపాము విషం ఏ వ్యవస్థ పై పనిచేయును?
13. రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతకర్త ఎవరు?
14. ఖనిజాలను గాలి తగలకుండా వేడిచేయడాన్ని ఏమందురు?
15. కబడ్డి ఆట ఏ దేశంలో పుట్టింది?
16. బెంగాల్  సం//లో విభజించ బడింది?
17. సింధునాగరికత ఏ సం//లో జరిగిందని భావిస్తున్నారు?
18. గదర్ పార్టి స్థాపకుడెవరు?
19. మౌర్యులలో గొప్ప చక్రవర్తి ఎవరు?
20. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడెవరు?
21. దక్షిణమెరికా లోని సమశీతోష్ట గడ్డిభూములను ఏమందురు?
22. ఆస్ట్రేలియా ఖండాన్ని ఎవరు,ఎప్పుడు కనుగొన్నారు?
23. సూర్యుడు భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది?
24. కాలిక్యులేటర్ ను కనుగొన్నది ఎవరు?
25. ఒమన్ రాజధాని ఏది?
[జవాములు; 1.అక్కినేని లక్ష్మి వరప్రసాద్ (L.V.ప్రసాద్), అక్కినేని నాగేశ్వర రావు 2.బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి 3.ఆర్ధికబిల్లులు 4) 4వ పంచవర్షప్రణాళిక 5.ఆర్.కె.నారాయణ 6.బాలగంగాధర తిలక్ 7.చేమకూర వేంకటకవి 8.సర్పగంధి 9.హైడ్రోఫోబియా లేదా రేబిస్ 10.సల్ఫ్యూరిక్ ఆమ్లం 11.ఫెర్రిక్ ఆక్సైడ్ 12.నాడి, శ్వాసవ్యవస్థలు 13.సర్ సి.వి.రామన్ 14.కాల్సినేషన్ 15.ఇండియా 16) 1905 17.క్రీ.పూ.3000 నుండి 1500సం//ల మధ్య 18.లాలా హరదయాళ్ 19.అశోకుడు 20.ఎ.ఒ.హ్యూమ్ 21. పాంపాలు 22,జేమ్స్ కుక్, 1788 23) 13 లక్షల రెట్లు 24. బాబేజ్ 25.మస్కట్]

Comments

Popular Posts