G.K.క్విజ్-18
1. సూపర్ నోవా ను ఏ సంవత్సరంలో గుర్తించారు?
2. ప్యారిస్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
3. మనదేశంలో ఆంగ్లభాషను ప్రవేశ పెట్టిన బ్రిటిష్
గవర్నర్ జనరల్ ఎవరు?
4. రష్యా సహకారంతో మన ప్రభుత్వం నెలకొల్పిన
ఇనుము-ఉక్కు
కర్మాగారాలు ఏవి?
5. మేరీక్యూరీ దంపతులు కనుగొన్న మూలకం ఏది?
6. డయేరియా వ్యాధికి కారణమగు సూక్ష్మజీవి ఏది?
7. ఆకుపచ్చని కాయలను పండునట్లు చేయునది ఏది?
8. ‘డ్రై
ఐస్’ అని
దేనిని అందురు?
9. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమందురు?
10. రక్తంలో ఉండే మూలకం ఏది?
11. రిప్రిజిరేటర్లలో శీతలీకరణిగా ఉపయోగపడునది ఏది?
12. అమెజాన్ నది ప్రాంతంలో నివసించు ఆదిమవాసులు ఎవరు?
13. దృవముల వద్ద వేసవి పగటికాలం ఎంత?
14. వెసూవియస్ అగ్ని పర్వతం ఏ దేశంలో కలదు?
15. గోదావరి నది జన్మస్థానం ఏది?
16. ఆస్ట్రియా దేశ రాజధాని ఏది?
17. కర్కటరేఖ పై సూర్యుడు ఏ రోజు ప్రకాశిస్తాడు?
18. N.A.S.A ను విస్తరించుము?
19. మనదేశంలో రాజభరణాలను రద్దు చేసిన సం// ఏది?
20. 9వ పంచవర్షప్రణాళిక పెట్టుబడి వ్యయం ఎంత?
21. ప్రస్తుతం (2011) మనదేశ అక్షరాస్యతా శాతం
ఎంత?
22. స్పెయిన్ జాతీయ క్రీడ ఏది?
23. ప్రపంచ మానవ హక్కుల దినం ఏ రోజు జరుపుకొందురు?
24. ‘ఇండియా డివైడెడ్’ గ్రంథకర్త ఎవరు?
25. ప్రపంచంలో పెద్ద గ్రంథాలయం ఏది?
[జవాబులు; 1) 1988
2.సెయిన్ నది 3.విలియం బెంటింక్ 4.భిలాయ్.బొకారో 5.రేడియం, పోలోనియం 6.అమీబా 7.ఇథలీన్
8.ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్ 9.సెరికల్చర్ 10.ఐరన్ 11.అమోనియా 12.రెడ్
ఇండియన్స్ 13. 6నెలలు 14.ఇటలీ 15.మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా, త్రయంబక్ వద్ద.
16.వియెన్నా 17.జూన్ 21 18.నేషనల్
ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 19) 1970 20) 8,75,000 కోట్లు 21) 74.04% 22. ఎద్దుల
పోట్లాట(బుల్ ఫైట్స్) 23.డిశంబర్,10. 24. బాబూ రాజేంద్ర ప్రసాద్ 25. లెనిన్ స్టేట్
లైబ్రరీ, మాస్కో]
Comments
Post a Comment