G.K.క్విజ్-15

1. వాలీబాల్ ఆట మొదట ఏదేశంలో పుట్టింది?
2. అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది?
3. మన పంచవర్షప్రణాళికల అంతిమ లక్ష్యం ఏమి?
4. పిల్లలలో ఎముకల పెరుగుదలకు అవసరమయ్యేవి ఏమిటి?
5. సముద్రయానంలో దూరములను ఏ ప్రమాణంలో కొలుస్తారు?
6. వినాళగ్రంథులు స్రవించే స్రావాలను ఏమందురు?
7. మానవునిలో వెన్నుపూసల సంఖ్య ఎంత?
8. ఇందిరాగాంధీ 14 బ్యాంకులను ఏ సం//లో జాతీయం చేసింది?
9. ఆర్యసమాజము ను స్థాపించినదెవరు?
10. గోలకీమఠం ఎవరి కాలంలో వెలసింది?
11. ఇటలీలో ఫాసిస్ట్ ఉద్యమ నాయకుడు ఎవరు?
12. ఈఫిల్ టవర్ ను ప్యారిస్ లో 1889 లో ఎందుకు నిర్మించారు?
13. గ్రహాలన్నింటిలో పెద్దది ఏది?
14. కాంగోనది ఏ ఖండంలో ఉన్నది?
15. 'భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర' అను గ్రంథ రచయిత ఎవరు?
16. ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రపాలిత ప్రాంతం ఏది?
17. ప్లాసీ యుద్ధం ఏ సం//లో జరిగింది?
18. పెన్నీతపాలా పద్దతిని మొదట ప్రవేశపెట్టినది ఎవరు?
19. భూమికి,గ్రహాలకు సూర్యుడు కేంద్రమని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
20. దక్షిణాఫ్రికా రాజధాని ఏది.
21. D.D.T ని విస్తరించుము?
22. ఎపికల్చర్ అనగా నేమి?
23. మనదేశంలో సుప్రీంకోర్టు విధించు మరణశిక్షలను రద్దు చేయు అధికారం ఎవరికి కలదు?
24. విశ్వంభర కావ్యకర్త ఎవరు?
25. 1576 లో హాల్డీగాట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?

[జవాబులు; 1. అమెరికా 2.స్పుత్నిక్-1  3.సామ్యవాద సమాజస్థాపన 4.కాల్షియం, ఫాస్పరస్, విటమిన్-డి 5.నాటికల్ మైల్స్ 6.హార్మోన్స్ 7) 33  8) 1969 9) దయానంద సరస్వతి 10.కాకతీయులు 11.బెనిటో ముస్సోలినీ 12.ఫ్రెంచి విప్లవం శతాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా. 13.గురుడు 14.ఆఫ్రికా 15.భోగరాజు పట్టాభి సీతారామయ్య 16.యానాం 17.క్రీ.శ.1757 18.ర్యాలెండ్ హిల్ 19.కోపర్నికస్ 20.కేప్ టౌన్ 21. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోథిన్ 22.తేనెటీగల పెంపకము 23.రాష్ట్రపతి 24.డా.సి.నారాయణరెడ్డి 25. అక్బర్, రాణాప్రతాప్ సింగ్ ]

Comments

Popular Posts