జి.కె. క్విజ్-2

 1.ఆంధ్రప్రదేశ్ కు ఉత్తర సరిహద్దున గల రాష్ట్రాలు ఏవి?
2. తూర్పుకనుమలలో ఎత్తైన పర్వతశిఖరం ఏది?
3. ఓనం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకొంటారు?
4. అంతర్జాతీయ అక్షరాస్యతా దినం ఏరోజు జరుపుకొందురు?
5. భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు?
6. నెప్ట్యూన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
7. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎంతకాలం పడుతుంది?
8. సూర్యకిరణాలు భూమధ్యరేఖపై ఏఏ రోజులలో లంబంగా పడతాయి?
9.ప్రపంచంలో మిక్కిలి పొడవైన రైల్వే ప్లాట్ ఫారం ఏది?
10. మైన్మార్ కరెన్సీ ఏది?
11. ఫ్రాన్స్ జాతీయ చిహ్నం ఏది?
12.అంగోలా  రాజధాని ఏది?
13. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు?
14. వాస్కోడి గామా ఇండియాకు సముద్రమార్గమును ఎప్పుడు కనుగొనెను?
15. I.L.O  అనగా నేమి?
16. రాజీనామా చేసిన తొలి భారత ప్రధాని ఎవరు?
17. సరీసృపాల గుండెలో ఎన్ని గదులుండును?
18. తెలుగులో బాలవ్యాకరణం వ్రాసినదెవరు?
19. స్కర్వి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
20. భారతదేశం పంపిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది?
21. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడెవరు?
22. సింధు నాగరికత ప్రజల ఆరాధ్యదేవత ఎవరు?
23. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
24. తొలి భారతరత్న అవార్డ్ గ్రహీత ఎవరు?
25. జీవరాశి లో అతి సూక్ష్మ మైనది ఏది?
[జవాబులు;1.చత్తీస్ గడ్,ఒడిసా2.మహేంద్రగిరి 3.కేరళ 4.సెప్టెంబర్-8  5. రాష్ట్రపతి 6.జె.జి.గాలి 7) 27 రోజుల,7 గం.ల,43ని. 8. మార్చి21, సెప్టెంబర్ 23. 9.ఖరగ్ పూర్ 10. క్యాట్  11. లిల్లీ పూవు 12.లువండా 13. బెంగుళూర్ 14. 1498  15. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్  16.మొరార్జీ దేశాయ్ 17.మూడు 18.చిన్నయసూరి  19.విటమిన్-సి 20.ఆర్యభట్ట 21.సుభాష్ చంద్రబోస్ 22.అమ్మతల్లి 23.న్యూయార్క్ 24.సి.రాజగోపాల చారి 25.వైరస్]

Comments

Popular Posts