G.K.క్విజ్-14

1. అరుణాచల్ ప్రదేశ్ లో హిమాలయాలను ఏమని పిలుస్తారు?
2. చిత్రావతి ఏ నదికి ఉపనది?
3. అహమ్మదాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
4. ఇర్నా వార్తా సంస్థ ఏ దేశానికి చెందినది?
5. మనదేశంలో అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది?
6. చుటియాలు అను గిరిజన తెగ గల రాష్ట్రం ఏది.
7. బెంగాల్ ను విభజించిన గవర్నర్ జనరల్ ఎవరు?
8. ప్రజా ఉద్యమాలను అణచుటకు 1919 లో చేసిన చట్టం ఏది?
9. మహమ్మద్ ప్రవక్త  సంవత్సరంలో జన్మించెను?
10. వైష్ణవ భక్తులను ఏమని పిలిచెదరు?
11. ఏ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు మనదేశంలో దివానీ అధికారంను పొందిరి?
12. సాలడైజేషన్  అనగా నేమి?
13. గాయిటర్ వ్యాధికి మూల కారణమేమి?
14. ఎలక్ట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
15. తెల్లరక్త కణాలు అధికమైనచో కలిగే వ్యాధి ఏమి?
16. శరత్ ఋతువు ఏయే నెలలు?
17.లోటుబడ్జెట్ విధానం అనుసరించడంవల్ల ఏమి ఏర్పడును?
18. ఎ టేల్ ఆఫ్ టు సిటీస్ గ్రంథకర్త ఎవరు?
19. 11వ పంచవర్ష ప్రణాళిక ఏయే సం//ల మధ్య అమలు జరిగింది?
20. డేవిస్ కప్ ఏ ఆటకు సంబంధించినది?
21. నల్గొండకు ప్రాచీన నామమేమి?
22. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ మిమిక్రీ కారుడు ఎవరు?
23. సైలెంట్ వ్యాలీ ఎక్కడ కలదు?
24. బ్రిటన్ లో మహిళలకు తొలిసారిగా ఓటు హక్కు ఎప్పుడు లభించింది?
25. లోక్ సభకు తొలిసారి ఏ సం//లో ఎన్నికలు జరిగినవి?

[జవాబులు; 1.పూర్వాంచల్ 2.పెన్నానది 3.సబర్మతి 4.ఇరాన్ 5.అరుణాచల్ ప్రదేశ్ 6.అస్సోం 7.లార్డ్ కర్జన్ 8.రౌలట్ చట్టం 9.క్రీ.శ.570 10.ఆళ్వారులు 11.బక్సార్ యుద్ధం,1764 12.పచ్చి కూరలు తినడం 13.అయోడిన్ లోపం 14.జె.జె.థాంప్సన్ 15.లుకేమియా 16.ఆశ్వయుజం, కార్తీకము 17.ద్రవ్యోల్బణం 18.చార్లెస్ డికెన్స్ 19) 2007-2012  20.లాన్ టెన్నిస్ 21.నీలగిరి 22.నేరెళ్ళ వేణుమాధవ్ 23. కేరళ లోని పశ్చిమ కనుమలు 24) 1918  25) 1952 ]

Comments

Popular Posts