G.K.క్విజ్-17
1. మన రాజ్యాంగములో ప్రాథమిక విధులు 1976
లో ఏ కమిటీ సిఫార్సుల ననుసరించి
చేర్చబడినవి?
2. డెంగ్యూ జ్వరం ఏ దోమ ద్వారా వ్యాప్తి
చెందుతుంది?
3. మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా
వ్యాప్తిచెందుతుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
4. పాట్నా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
5. హంగేరి రాజధాని ఏది?
6. మధ్యప్రదేశ్ లోని ‘పన్నా’గనులు దేనికి ప్రసిద్ధి?
7. ప్రపంచంలోని అతి పెద్ద ద్వీపకల్పం ఏది?
8. పి.టి.ఐ వార్తా సంస్థ ఏ దేశానిది?
9. ఆరోగ్యవంతుని శరీరంలో ఎంత రక్తము ఉంటుంది?
10. ‘ఎయిడ్స్ డే’ ను ఏ రోజు జరుపుకొందురు?
11. మన దేహములో ఏ భాగములో ‘ఎ’-విటమిన్
నిలువవుంటుంది?
12. బోదకాలు వ్యాధిని కలుగజేయు దోమ ఏది?
13. ‘మయేపియా’ అను జబ్బు ఏ అవయవమునకు
వస్తుంది?
14. గడ్డ కట్టిన టండ్రాల క్రింద పెద్దమొత్తంలో ఏ వాయువు ఉన్నదని
శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
15. ఏ రెండు నదులు కలిసిపోయి, దేవప్రయాగ వద్ద గంగానది ప్రారంభమవుతుంది?
16. C.T.B.T ని విస్తరించుము?
17. రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి
పంపుతాడు?
18. ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’
గ్రంథరచయిత ఎవరు?
19. లోక్ సభ సభ్యుల గరిష్ఠ సంఖ్య ఎంత?
20. భగవద్గీతను ఎవరు వ్రాశారు?
21. సింధు నాగరికతకు సంబంధించి బయల్పడిన రెండు
నగరాలు ఏవి?
22. ఎవరి కృషి ఫలితంగా 1924 లో మనదేశంలో
కమ్యూనిస్టు పార్టి ఏర్పడింది?
23. గౌతమ బుద్ధుని ముఖ్య శిష్యులు ఎవరు?
24. అక్బర్ ప్రవేశ పెట్టిన సైనిక విధానము ఏది?
25. సమాచారహక్కు చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
[జవాబులు;
1.స్వరణ్ సింగ్ కమిటీ 2.ఎడిస్ దోమ 3. రోనాల్డ్ రాస్ 4.గంగానది 5.బుడాపెస్ట్
6.వజ్రాలు 7.అరేబియా 8.ఇండియా 9.ఐదు నుండి ఆరు లీటర్లు 10. డింశంబర్,1 11.కాలేయము 12.క్యూలెక్స్ దోమ 13.కన్ను
14.మిథేన్ 15.భగీరథి,అలకానంద 16. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్
ట్రీటీ 17. ఉపరాష్ట్ర పతికి 18. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 19. 545 20.వేద వ్యాసుడు 21.మొహంజదారో, హరప్పా 22.M.N.రాయ్
23.ఆనందుడు, ఉపాలి 24.మన్సబ్ దారి విధానం 25) 2005 ]
Comments
Post a Comment