ఎవరు ముందు? దేవుడా? మనిషా?
ఈ మధ్య
షిరిడిసాయిబాబా దేవుడు కాదని
కొందరు,దేవుడే నని మరికొందరు
వాగ్వివాదాలకు దిగుతున్నారు. అసలు దేవుడంటేఏమిటో ముందు నిర్వచించు కోవలసిన అవసరం
ఎంతైనా వుంది. షిరిడీసాయి బాబా నీళ్ళు పోసి దీపాలు వెలిగించడం,రాయిని మిఠాయిగా మార్చడం, గాలిలో తేలివుండడం,తనవద్దకు వచ్చిన భక్తుల మనసులోని విషయాలు
చెప్పగల్గడం,
మొదలగు మహిమలు చేసే వాడట.అందుకే అతడు
దేవుడయ్యాడు.ఏసు క్రీస్తు మూడు రొట్టెలను వందల
మందికి పంచాడు కాబట్టే దేవుడయ్యాడు. సత్యసాయిబాబా కూడా జుట్టులోంచి విభూతి, శివలింగాలు,ఉంగరాలు తీయడం, నీళ్ళను పెట్రోలు గా మార్చడం చేశాడుగా ఆయన దేవుడే.ఇంకా జూనియర్ సాయిబాబా,రామ్ దేవ్ బాబా,కాళేశ్వరి బాబా,నిత్యానంద స్వామి మొదలగు వారంతా చిన్నాచితకా
మహిమలు చేస్తున్నారుగా! వీళ్ళంతా దేవుళ్ళు కాదంటే వాళ్ళభక్తుల విశ్వాసాలను
దెబ్బతీసినట్లు కాదా?మహిమలు, మహత్తులు ప్రదర్శించినవారంతా దేవుళ్లైతే, పొట్టకోసం వీదుల్లో గారడీ, ఇంద్రజాలం చేసేవారంతా దేవుళ్ళేందుకు కాకూడదు?అలాగే దెయ్యాలు,భూతాలూ,దుష్టశక్తులు,చేతబడులు, తాయెత్తులు,మంత్రాలు
అవికూడా నిజమని నమ్మాలి మరి.చేతబడులు భూటకం, నమ్మొద్దని ప్రభుత్వం చెపుతుంది.బాబా ల
మహిమలు భూటకం అని ఎందుకు చెప్పరు?
ఒక పదార్ధాన్ని ఎవరు సృష్టించ లేరని సైన్స్ చెపుతున్నది.
బాబా లు చేసే వన్నీ,తాను
చేసి చూయించి ,అవన్నీ ట్రిక్స్ అని నిరూపించాడు ప్రముఖ మెజీషియన్ పి.సి. సర్కార్ . కాబట్టి మూర్ఖ శిఖామణులు ఇప్పటికైనా
గ్రహించాలి. అజ్ఞాన భక్తుల అండదండలుంటే బాబాల పటాలనుండి విభూతి,లింగాలు రాలుతుంటాయి.విగ్రహాలు పాలుతాగుతాయి.నిజంగా మహిమే వుంటే పటాలనుండి
పట్టెడన్నము రాల్చ వచ్చుగా!
పేదోళ్ళంతా
గుడిసె గుడిసె లో బాబా ల ఫోటోలు
పెట్టుకొనేవారుగా!
నేడు సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నదో,
దానికి సమాంతరంగా మతమౌఢ్యం కూడా అంతే డెవలప్ అవుతున్నది.దేవుడు మనిషిని సృష్టించడా,లేక మనిషే దేవుణ్ణి సృష్టించాడా? అనే సందేహం కలుగక మానదు.
నేటికీ 450 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి
ఏర్పడినదని శాస్త్రజ్ఞుల అంచనా.భూమి మీద మానవుడు అవతరించింది 1 లక్ష సంవత్సరాల
క్రితము మాత్రమే. అనగా 449 కోట్ల
99 లక్షల సంవత్సరాల వరకు భూమి మీద ఎటువంటి జీవం లేదు. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు?దేవునికి రోజూ దద్దోజనమ్ ,చక్రపొంగలి ఎవరు పెట్టేవారు?ఏటేటా దేవుని పెళ్లిళ్లు ,రథోత్సవాలు ఎవరు జరిపించేవారు?పూజలు ఎవరు చేసేవారు?
కష్ట జీవికి దేవునితో పనిలేదు.తన కష్టాన్ని
నమ్ముకొంటాడు. కష్టపడటం చేతకాని వాళ్ళే దేవుణ్ణి సృష్టించి ,దేవుని ద్వారా ఉపాధిని కల్పించుకొన్నారు.అక్రమంగా సంపాదించిన వారంతా పాప భీతితో,వారి అక్రమార్జనలో కొంత –తిలా పాపం తలా
పిడికెడు అన్నట్లు,ఇటువంటి బాబాలకు,దేవుళ్ళకు సమర్పించు కొని వాళ్ళ అభివృద్ధికి
దోహద పడుతున్నారు.
అయ్యా... నాకు బోల్దు కష్టలున్నాయి వాటినుంచి స్వాంతన పొందడానికి నేను విస్కీనో, డ్రగ్స్‌నో ఆశ్రయిస్తాను. కొందరి దేవుణ్ణి ఆశ్రయించి వాడి చంక నాకుతారు. ఆ చంకనాకుడు కార్యక్రమాన్నే భక్తిప్రదర్శన అంటారు.
ReplyDeleteట్రిక్కును బయటకు చెబితే వాడు గారడీవాడు. దాన్నే ఆధ్యాత్మిక ముసుగులో దాస్తే వాడే అవతార పురుషుడుసార్! సాయిబాబా గురించి హిందూ అతివాదులుకూడా వ్యాఖ్యానించకపోవడానికి కారడం సాయిబాబా popularity.
చాలా చక్కని కామెంట్.ధన్యవాదములు.
ReplyDelete