G.K.క్విజ్-8
1. భారతదేశం ఒలంపిక్ క్రీడలలో ప్రవేశించిన
సంవత్సరమేది?
2. స్వదేశీ సంస్థానాలను విలీనం చేయుటలో ఎక్కువ
కృషి చేసిన నాయకుడెవరు?
3. రెండవ పులకేశిని ఓడించి చంపిన పల్లవ రాజెవరు?
4. తళ్ళికోట యుద్ధం ఏ సం//లో జరిగింది?
5. అక్బర్ రద్దు చేసిన హిందువులపై పన్ను ఏది?
6. భారతదేశపు హరితవిప్లవ పితామహుడెవరు?
7. విటమిన్-సి రసాయనిక నామమేమిటి?
8. బుద్ధచరిత్రము గ్రంథరచయిత ఎవరు?
9. ‘మల్కిభరామ్’ అను బిరుదు ఎవరికి
కలదు?
10. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటి అధ్యక్షుడెవరు?
11. I.N.S.A.T ను
విస్తరించుము?
12. ‘పో’ నది ఏ దేశంలో కలదు?
13. బహమని సుల్తానుల రాజధాని ఏది?
14. ద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించిన దెవరు?
15. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అను
నినాదం ఎవరిది?
16. మెగ్నీషియం లోపిస్తే వచ్చు వ్యాధి ఏది?
17. వజ్రం ప్రకాశించుటకు గల కారణమేమి?
18. A Passage to India గ్రంథకర్త ఎవరు?
19. కళాపూర్ణోదయం కావ్యకర్త ఎవరు?
20. అంతర్జాతీయ న్యాయస్థానం ఎచ్చట ఉన్నది?
21. రెండవ పంచవర్ష ప్రణాళికను ఎవరు
రూపొందించిరి?
22. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు
చేర్చబడినవి?
23. ఖజురహో దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు?
24.భారత్, ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య గల సరిహద్దు
రేఖ ఏది?
25.రాష్ట్రపతి గా పోటీచేయుటకు ఎంత కనీస వయస్సు
ఉండాలి?
[జవాబులు; 1) 1920
2.సర్దార్ వల్లబాయ్ పటేల్ 3. మొదటి నరసింహవర్మ 4.క్రీ.శ.1565 5. జిజియా పన్ను 6.M.S.స్వామినాధన్
7.ఆస్కార్బిక్ ఆమ్లం 8.అశ్వఘోషుడు 9.ఇబ్రహీం కుతుబ్ షా 10.డా.బి.ఆర్.అంబేద్కర్
11.ఇండియన్ నేషనల్ శాటిలైట్ 12.ఇటలీ 13.గుల్బర్గా 14.మధ్వాచార్యులు 15. మహమ్మద్
ఇక్బాల్ 16.అలసట 17.సంపూర్ణ అంతరపరావర్తనము 18.E.M.ఫ్రాస్టర్ 19.పింగళి సూరన
20.హేగ్ నగరం 21.మహలనోబిస్ 22. 42వ సవరణ 23.మధ్యప్రదేశ్ 24.డ్యూరాండ్ రేఖ 25. 35
సం// ]
Comments
Post a Comment