G.K.క్విజ్-6

1. ఈస్టిండియా కంపెనీ వర్తక కేంద్రానికి మనదేశంలో అనుమతినిచ్చిన చక్రవర్తి ఎవరు?
2. వందేమాతరం ఉద్యమానికి మరొక పేరేమి?
3. ఆర్యులు మొదట ఏదేశానికి చెందినవారు?
4. శాతవాహనుల మొదటి, రెండవ రాజధానులు ఏవి?
5. క్రీ.శ.1192 లో జరిగిన 2వ తరైన్ యుద్ధంలో ఫృధ్వీరాజును ఓడించిన దెవరు?
6. సెయింట్ సోఫియా చర్చిని ఎవరు నిర్మించిరి?
7. మయన్మార్ లో ప్రజాస్వామిక ఉద్యమ నాయకురాలు ఎవరు?
8. ఉసిరి,జామ,నిమ్మకాయలలో ఎక్కువగా లభించే విటమిన్ ఏది?
9. శరీరంలో ఏ అవయవం సరిగా పనిచేయనందున కామెర్ల వ్యాధి వస్తుంది?
10. కణంలో శక్తి కేంద్రాలు ఏవి?
11. పర్యావరణంపై క్యోటో ప్రోటోకాల్ తీర్మానం ఏ సం//లో జరిగింది?
12. కఠిన జలంలో ఏ రసాయనాలు ఎక్కువగా ఉండును?
13. ద్రవాల సాంద్రతను కొలుచుటకు ఉపయోగించు పరికరం ఏది?
14. పథేర్ పాంచాలి నవలా రచయిత ఎవరు?
15. మనుచరిత్ర కావ్యము వ్రాసిన కవి ఎవరు?
16. గురుదేవ్  అను బిరుదు ఎవరికి కలదు?
17. సన్నకారు రైతులు అంటే ఎవరు?
18. 1977 లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది?
19. భారత సంఘటితనిధిపై ఎవరికి అధకారం కలదు?
20. B.P.O ను విస్తరించుము?
21. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఏది?
22. సూర్యుని కేంద్రంలో ఎంత ఉష్ణోగ్రత ఉండును?
23. ఇరాన్ పార్లమెంటును ఏమందురు?
24. ఇతియోపియా రాజధాని ఏది?
25. రోమ్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

[జవాబులు; 1.జహంగీర్ 2.విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమం 3.జర్మనీ 4.ధాన్యకటకము,ప్రతిష్టానపురము 5.మహమ్మద్ ఘోరి 6.జస్టీనియస్ 7.ఆంగ్ సాన్ సూకీ 8.విటమిన్-సి 9.కాలేయం 10. మైటోఖాండ్రియా 11) 1997 12.మెగ్నీషియం, కాల్షియం 13.హైడ్రోమీటర్ 14.విభూతి భూషన్ బందోపాధ్యాయ 15.అల్లసాని పెద్దన 16.రవీంద్రనాధ్ టాగోర్ 17)5 నుండి10 ఎకరాలలోపుఉన్నరైతులు. 18.జనతాపార్టి 19.రాష్ట్రపతి 20.బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ 21.సహారా 22) 10,00,0000C 23.మజ్లిస్ 24.అడిస్ అబాబా 25.టైబర్ నది.]

Comments

  1. రెడ్డి గారూ, GK-6 లో మూడవ ప్రశ్న "ఆర్యులు మొదట ఏ దేశానికి చెందిన వారు?" కి సమాధానం "జర్మనీ" అని ఇచ్చారు. దీనికి సోర్స్ తెలుపగలరు. (జర్మనులది ఆర్యన్ జాతి అని హిట్లర్ చెప్పుకున్నాడు. నేను అడిగేది ఆ సోర్స్ కాదు). మనం చదువుకున్నది ఆర్యులు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని.

    ReplyDelete
  2. నరసింహారావుగారు,ఆర్యులు ఆర్కిటిక్ ప్రాతవాసులనియు,జర్మనులు, ఆర్యులు నోర్డిక్ జాతికి చెందిన వారని జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మరియు బాలగంగాధర తిలక్ మొదలగువారు పేర్కొన్నారు.ఆర్యులు యూరఫ్ నుండి వచ్చి మధ్యఆసియాలో స్థిరపడ్డారు.ఆ తర్వాత ఇండియాకు వచ్చారు.జర్మన్ భాషకు,సంసృతభాషకు చాలా పోలికలు ఉన్నాయి.

    ReplyDelete

Post a Comment

Popular Posts