అత్తిపండు-అనేకప్రయోజనాలు
అత్తిపండునేఇంగ్లీష్ లో ఫిగ్ అని, హిందీలో అంజీర్ అని అంటారు.దీనినే అంజూర అనికూడా పిలుస్తారు. ఇది మన ప్రాంతం లో విరివిగా
పెరిగే మేడిపండులా వుంటుంది. ఇది మేడి,మర్రి జాతికి చెందినదే. అంజీరలో అమోఘమైన పోషకాలు, ఔషధ విలువలు ఉన్నాయి. మనకు ప్రకృతిప్రసాదించిన గొప్పవరముగా దీనిని చెప్పుకోవచ్చు. అత్తిపండును తాజాగా కానీ,
ఎండుగా కానీ ఉపయోగించ వచ్చు.డ్రైప్రూట్స్ గా సూపర్ మార్కెట్లలో లభించును.
అత్తిపండు (అంజీర్ ) ఉపయోగాలు:
1.ఎనీమియాతో బాధపడేవారికి పాలతో కలిపి తీసుకొంటే రక్తం బాగా
పెరుగుతుంది .
2.ఇందులో రోగ నిరోధక శక్తిని పెంపొందించే
గుణాలు ఎన్నోవున్నాయి. ఏ వ్యాధితో
బాధపడుతున్నవాళ్ళైనను
అంజీర్ ను తీసుకొంటే త్వరగా కోలు కొంటారు.
3.అంజీర్ లో అధికంగా ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
4. ఈ ఫలాలు మధుమేహం
,బ్రాంకైటీస్, ఆస్తమా, దగ్గు వంటి ఊపిరితిత్తుల వ్యాధులను
తగ్గించడం లో
చక్కగా పనిచేస్తాయి.
5. వీటిలోని పీచు
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మోనో పాజ్ తర్వాత వచ్చేరొమ్ము క్యాన్సర్ ను
నివారిస్తుంది.
6. అత్తిపండ్లు
లైంగిక బలహీనతలను తగ్గించడం లో బాగా పనిచేస్తాయి. రోమనులువీటిని సంతాన
ఫలాలుగా
భావిస్తారు.
7.మలబద్ధ కానికి ఈ పండు మంచి మందు.పొద్దున్నే పరగడుపున రెండు పండ్లను నీటిలో నానబెట్టి ,ఆ నీటితో
సహా తింటే మలబద్దకం పూర్తిగా
తొలగిపోతుంది. 40 రోజులు ఈ విధంగా తీసుకోవాలి.
8.అంజీర్ లో అధికంగా వుండే కాల్షియమ్ ఎముకల వృద్ధికి ,ట్రిప్టోపాన్ హాయిగా నిద్రపట్టేందుకు, ఇందు
లోని జిగురు గొంతు నొప్పిని తగ్గించడానికి ,ఒమేగా ప్యాటీఆమ్లాలు గుండెజబ్బుల
నివారణకు తోడ్పడుతాయి.
9. ఈ పండ్లు
వృద్ధాప్యం లో వచ్చే దృష్టి లోపాలను తగ్గిస్తాయి.
కావున రోజూ రెండు అంజీర్ పండ్లను
తినండి. ఆరోగ్యముగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా!
Comments
Post a Comment