జుట్టు రాలుట సమస్యలు-నివారణ మార్గాలు
జుట్టు రాలుట సమస్యలు –నివారణ మార్గాలు
పురుషుల కైనా, స్త్రీల కైనా అందాన్ని ఇనుమడింప జేసేవి వెంట్రుకలే. ఒకప్పుడు
మనదేశములో కేశసంపదకుకొదవలేదు. స్త్రీలు పొడవైనజుట్టుతో , పురుషులు ఉంగరాల,నొక్కుల, జులపాలతో అందంగా కనపడేవారు. బట్టతల గలవారు 1% కంటే
తక్కువ
వుండేవారు. కాని ఇప్పుడు యువకులలోనే
30% పైగా
బట్టతలవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు,సాఫ్ట్
వేర్ రంగం లో వారికి జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది.
జుట్టు రాలుట (హేర్ ఫాలింగ్ ) కు ప్రధాన
కారణాలు :
.1. మానసిక
ఒత్తిడి, చిన్న
విషయానికి ఎక్కువ ఆలోచించడం.
2. వేళకు
నిద్రపోక
పోవడం 3. సమతుల పోష కాహారం లోపించడం.
4. వాతావరణ
కాలుష్యం. 5. రసాయనాలు (షాంపులు,హేర్ డై ) ఎక్కువ వాడడం.
6. చీటికి
మాటికి యాంటీ బయోటిక్స్ ఎక్కువ తీసుకోవడం.
7. జబ్బు చేసి బలహీన
పడినప్పుడు ఎక్కువ జుట్టు రాలుతుంది.
8 త్వరగా సన్నపడాలని అతిగాచేసే
ఎక్సర్ సైజులు, డైటింగ్ లు
9. ఎనీమియా (ఐరన్ లోపం
), B12 విటమిన్ లోపించడం, జింక్ లోపించడం.
10. టైఫాయిడ్ వల్ల, 11 యాంటీ క్యాన్సర్ మందులు
వాడటం,రేడియో తెరఫీ వల్ల.
12. ప్రొజెస్టిరాన్, టెస్టో స్టిరాన్ హార్మోన్స్
లోపించడం లేదా ఎక్కువ కావడం.
13. వంశ పారంపర్యంగా బట్ట తల
రావడం.
వంశపారంపర్యంగా, సహజంగా వచ్చిన బట్టతల
మళ్ళీ మొలవదు. ఇన్ఫెక్షన్, జబ్బులవల్ల పోషకాహార లోపం వల్ల,
ఏర్పడిన బట్టతలకు చికిత్స చేస్తే చాలావరకు జుట్టు వస్తుంది.
జుట్టు రాలకుండా
ఆపడానికి, తిరిగి వెంట్రుకలు
మొలవడానికి మార్గాలు:
అల్లోపతీ వైద్యం: బట్టతల ఏర్పడినచోట
HAIREX solution(Minoxidil) or
HEBALDsolution(Minoxidil)
పై మందులలో ఏదో ఒకటి ఉదయం ఒక చుక్క (1 ml),సాయంత్రం ఒక చుక్క మందును వేసి వేలితో మర్దన చేయాలి.
అలా
కనీసం నాలుగు నెలలు రాయాలి. 4 నెలలతర్వాత వెంట్రుకలు
మొలవడం మొదలవుతాయి. మొలిచిన తర్వాత కూడా రోజు రెండు
పూటలు పై మందు
రాయాలి.
ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం: 1.నల్లమందు,లిల్లీపూలరసాన్నిసారాయిలోకలిపితైలముగావాడితేజుట్టురాలదు.
క్రీ. పూ 400 లో హిప్పో క్రేట్స్ ఈ విధానం
కనుగొన్నాడు.
2. కలబంద
లోని తెల్లని గుజ్జును తీసి, కొబ్బరి నూనె లో మరిగించి, ఆ తైలాన్ని రోజు
రాసిమర్దన చేస్తుంటే జుట్టు
రాలదు . 3. కట్టెలు, దుంగలపై తేమకు పెరిగే ఒక రకమైన పుట్టకొక్కులు(శిలీంద్రం ) ను తెచ్చి ఎండబెట్టి, కాల్చి ఆ బూడిదను కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి బట్టతలకు రాస్తుంటే ఒకటి రెండు నెలలలో ‘నూగులా' వెంట్రుకలు మొలుస్తాయి. తర్వాత దట్టంగా పెరుగుతాయి. ఇది చాలా ఉత్తమ చికిత్స.
రాలదు . 3. కట్టెలు, దుంగలపై తేమకు పెరిగే ఒక రకమైన పుట్టకొక్కులు(శిలీంద్రం ) ను తెచ్చి ఎండబెట్టి, కాల్చి ఆ బూడిదను కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి బట్టతలకు రాస్తుంటే ఒకటి రెండు నెలలలో ‘నూగులా' వెంట్రుకలు మొలుస్తాయి. తర్వాత దట్టంగా పెరుగుతాయి. ఇది చాలా ఉత్తమ చికిత్స.
4. ఒక ఉల్లిపాయను కచ్చాపచ్చా దంచి ఒక కప్పు రమ్
లో వేసి 24 గంటల తర్వాత దానిని గుడ్డలోవేసి వడకట్టి(గట్టిగా పిండి ),ఆ రసాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ తలకు రాస్తుంటే వెంట్రుకలు రాలవు. జుట్టు పెరుగుతుంది. ప్రపంచ సుందరి, ఈజిప్సియన్ రాణి క్లియోపాట్ర ఈ విధానం అవలంభించేదట.
5.ముల్లంగిరసం ,ఉల్లిపాయలరసం కలిపి రాసి,మర్దన చేస్తుంటే
జుట్టు పెరుగును.
6. జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బీన్స్, నల్లనువ్వులు, లాంటివి ఆహారంగా తీసుకొంటే జుట్టు పెరుగును.
7. B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్, జుట్టు
రాలుటను నివారించును.
కొసమెరుపు
–B.P ని తగ్గించడానికి
వాడే ట్యాబ్లెట్స్ లో వెంట్రుకలు పెరగడానికి దోహదపడే ఒక రకమైన
ఔషధం (సైడ్ఎఫెక్ట్
గా ) ఉంది. అందుకనే వారికి జుట్టు బాగా పెరుగుతున్నదట.
గమనిక: వయస్సు
పైబడినవారికి ,ముసలి వారికి పై చికిత్సా విధానాలు
సత్ఫలితాలనివ్వవు. వారు మంచి పోషకాహారం తీసుకొంటుంటే కొంతవరకు జుట్టు రాలుటను నివారించ వచ్చు.
Comments
Post a Comment