ఎన్నికల హామీలు -ఆర్దికాభివృద్ధికి హానీలు !

ఎలాగైనా అధికారంలోకి  రావాలని, ప్రజలు అడగకపోయినను రుణమాఫీ వరాలు గుప్పించారు కొన్నిపార్టీలవాళ్లు. అధికారంలోకి వచ్చాక మల్లగుల్లాలు పడుతున్నారు హామీలు నెరవేర్చడానికి . తెలంగాణాలో తెరాస పార్టీ లక్ష వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని వాగ్దానం చేసి , ఇప్పుడు 2013-14 లో తీసుకొన్న ఒక్క సంవత్సర రుణాలను మాత్రమే రద్దుచేస్తామనిప్రకటించడం  రైతులను మోసం చేయడమే. చేతగానిహామీలుఎవరివ్వమన్నారు  రైతులు అడిగారా? ఇప్పుడు మాటమార్చితే ఊరుకోంటారా?వీళ్ళు తెలంగాణా ఉద్యమ బిడ్డలు .ఉద్య మాలు వీరికి కొత్తకాదని కె.సి.ఆర్  గ్రహించాలి.రైతులంతా అప్పుడే ఉద్యమ దారిపట్టారు .అప్పుడే ఏమైంది ,ముందున్నది 
 మొసళ్ళ పండుగ . రుణాలనుండి గట్టెక్కినా ,కేజీ  నుండి పీజీ  వరకు  ఉచిత విద్య హామీ  మాటేమిటి? గవర్నమెంట్  మరియు ప్రయివేట్ కాలేజీలన్నింటిలో ఫీజులు మాఫీ చేస్తాడా? ప్రయివేట్ ఇంజనీరింగ్, మెడికల్ ఫీజులు లక్షల్లోవుంటాయి . అవన్నీసాధ్యమా?  
         అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి  పరిస్థితి ఇంకా విషమం .లక్ష పరిమితి అనేది లేకుండా రైతుల, ,
డ్వాక్రామహిళల  రుణాలు ఎన్నిఉన్నా మొత్తం రద్దుచేస్తా నని హామీ ఇచ్చాడు .అవన్నీ మాఫీ చేయడానికి 75000 
కోట్లు కావాలని అధికారులు  అంటున్నారు . ఇవన్నీ ఎట్లా సాద్యము ?ఆర్దికపరిస్థితి సంగతేమిటి? మిగతా అభివృ
ద్ధి కార్యక్రమాలు కుంటుపడవా?
  ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి . ఇటువంటి పనికిమాలిన (శక్తికిమించిన ) ఎన్నికల హామీలు ఇవ్వకూడదని .
రైతులను  ఆదుకోవడములో తప్పులేదు .లక్షల రుణాలను తీసుకొన్న పెద్దరైతులను వదలి ,చిన్న రైతులకే రుణమాఫి ఇవ్వాలి .ఈ రుణమాఫీలు రైతులలో అలసత్వం ,బాధ్యతారాహిత్యం ,సోమరితత్వం పెంపొందిస్తాయి .
భవిష్యత్తులో ఎవరూ రుణాలు చెల్లించరు.                                         

Comments

Popular Posts