G.K.క్విజ్-7

1. మొదటి ఆసియా క్రీడలను ప్రారంభించినదెవరు?
2. విలియం కోటను ఆంగ్లేయులు ఎచ్చట నిర్మించిరి?
3. 1916 లో మితవాదుల,అతివాదుల ఐక్యతకు తోడ్పడి, హోం రూల్ ఉద్యమాన్ని నడిపినదెవరు?
4. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో మన దేశ ఉత్పత్తి ఎంతశాతం?
5. ఎల్లోరా లో కైలాసనాధ గుహాలయమును నిర్మించిన రాజెవరు?
6. ఆదివాసీల హక్కుల కొరకు జల్-జంగల్-జమీన్ (నీరు-అడవి-భూమి) అను నినాదంతో పోరాడిందెవరు?
7. డార్విన్ తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన సం// ఏది?
8. 2010 డిశంబర్ లో అరబ్బుదేశాలలో చెలరేగిన నిరసన ఉద్యమాన్ని ఏమందురు?
9. గుండె చుట్టూ ఉండే పొరను ఏమందురు?
10. శరీరంలో ఎయిడ్స్ వైరస్ ను గుర్తించడానికి చేసే పరీక్షనేమందురు?
11. ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ ఏ లోహం?
12. ఛండాలిక, చిత్ర, గోరా నవలల రచయిత ఎవరు?
13. అక్బర్ నామా గ్రంథకర్త ఎవరు?
14. 1979 లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది?
15. ఏ దేశాలను మూడవ ప్రపంచదేశాలుగా పిలుస్తారు?
16. మన దేశంలో  కాంగ్రెసేతరపార్టి తొలి ప్రధాని ఎవరు?
17. మన దేశంలో న్యాయమూర్తుల జీతభత్యాలు ఏ నిధి నుండి చెల్లించ బడును?
18. B.B.C ని విస్తరించుము?
19. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ ఎంత శాతం మించితే ప్రాణాపాయం కల్గును?
20. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు?
21. బైరా-సియోల్ జలవిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు?
22. గల్ఫ్ లేదా  సింధ్ శాఖ అనగా నేమి?
23. కర్పూర తైలంను ఏ చెట్టు నుండి తీస్తారు?
24. మొత్తం మీద భారతదేశ శీతోష్ణస్థితిని ఏ మందురు?
25. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మనదేశ జనాభా ఎంత శాతం?
[జవాబులు; 1.జవహర్ లాల్ నెహ్రూ 2.కలకత్తా 3.అనీ బిసెంట్ 4) 4% 5.రాష్ట్రకూట రాజు 1వ కృష్ణుడు 6.కొమరం భీం 7) 1837 8.అరబ్బు వసంతం 9.పెరికార్డియా 10.ఎలిసా 11. టంగస్టన్ 12.రవీంద్రనాధ టాగోర్ 13.అబుల్ ఫజుల్ 14.మదర్ థెరిసా15.అభివృద్ధి చెందుచున్న దేశాలను 16.మొరార్జీదేశాయ్ 17.భారత సంఘటితనిధి 18.బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ 19)0.4%  20. నెల్లూరు జిల్లాలో 21. హిమాచల్ ప్రదేశ్ 22.భూభాగం పైకి చొచ్చుకొని వచ్చిన సముద్ర జలభాగం 23.పైన్ 24.ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణస్థితి 25. 17%]       

Comments

  1. GK-7 లో రెండవ ప్రశ్నకు (విలియం కోట ఎక్కడ?) సరైన సమాధానం కలకత్తా అని ఉండాలి. మీరు చెప్పిన మద్రాస్ లో ఆంగ్లేయులు నిర్మించిన కోట పేరు ఫోర్ట్ సెయింట్ జార్జ్.

    ReplyDelete

Post a Comment

Popular Posts