G.K.క్విజ్-11

1. ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
2. కుకీలు అను గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కలరు?
3. 1901 సం//లో భారతదేశ జనాభా ఎంతఉండేది?
4. తొలి మూకీ చిత్రం రాజాహరిశ్చంద్ర (1913) ను నిర్మించినదెవరు?
5. ప్రపంచ పర్యాటక దినం ఏ రోజు జరుపుకొందురు?
6. భారతదేశంలో ఎత్తైన పర్వతశిఖరం ఏది?
7. బంగ్లాదేశ్ కరెన్సీ పేరేమి?
8. గాంధీజీ స్వీయచరిత్ర గ్రంథం పేరేమి?
9. గుప్తుల కాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడెవరు?
10. మహాబలిపురంలో శిల్పాలు చెక్కించిన రాజులు ఎవరు?
11. అద్వైత సిద్ధాంతమును ఎవరు ప్రతిపాదించారు?
12. R.A.D.A.R  ను విస్తరించుము?
13. సిస్మోలజి అంటే ఏమిటి?
14. గిర్ నేషనల్ పార్క్ ఎచ్చట ఉన్నది?
15. వైజయంతి యుద్ధటాంకుల కర్మాగారము ఎక్కడ ఉన్నది?
16. రేచీకటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
17. థైరాయిడ్ స్రావం తక్కువైతే వచ్చే వ్యాధి ఏది?
18. కంటి రెటీనాలో ఉండే కణాలు ఏవి?
19. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనగా నేమి?
20. సూర్యునికాంతి భూమిని చేరడానికి ఎంతకాలం పడుతుంది?
21. సుమతి శతకమును వ్రాసిన కవి ఎవరు?
22. లోక్ నాయక్ అను బిరుదు ఎవరికి కలదు?
23. సోషల్ కాంట్రాక్ట్  గ్రంథ రచయిత ఎవరు?
24. మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇవ్వబడింది?
25. ఏ ఆర్టికల్ ననుసరించి రిజర్వేషన్స్ అమలు చేయబడుచున్నవి?
[జవాబులు; 1.యమున 2.మణిపూర్ 3) 23 కోట్లు 4.దాదా సాహెబ్ పాల్కే 5.సెప్టెంబర్-5  6.K2 శిఖరం 7.టాకా 8.మై ఎక్స్పిరిమెంట్స్ విత్ ట్రూత్ 9.పాహియాన్ 10.పల్లవులు 11.ఆది శంకరాచార్యులు 12.రేడియో డిటెక్టింగ్ అండ్ రేంజింగ్ 13.భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రం 14.జునాగడ్ (గుజరాత్) 15.ఆవడి, తమిళనాడు 16.విటమిన్-ఎ 17.మరుగుజ్జుతనం 18.రాడ్స్ మరియు కోన్స్ 19. కాల్షియం సల్ఫేట్ 20) 8 నిమిషాలు 21.బద్దెన 22.జయప్రకాశ్ నారాయణ్23.రూసో 24.వ్యవసాయము 25.ఆర్టికల్ 335]  

Comments

Popular Posts