G.K. క్విజ్-1

                                                     
 1.భారతదేశంలో రెండు గొప్ప ఇతిహాసాలు ఏవి?
2.ప్రాచీన నాగరికతలన్నింటిలోను ప్రథమ నాగరికత ఏది?
3.పాలరాతి స్వప్నంగా కళావిమర్శకులు దేనిని వర్ణిస్తారు?
4.మనదేశంలో మొదటి బ్రిటిష్ రాజప్రతినిధి(వైశ్రాయ్) ఎవరు?
5.యునెస్కో ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు?
6.సూయజ్ కాలువ ఏ సం; లో జాతీయం చేయబడింది?
7.ఎవరి నాయకత్వంలో కేంద్రమంత్రిమండలి పనిచేస్తుంది?
8.రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఎవరు?
9.చైనా భారతదేశంపై ఎప్పుడు దండెత్తి వచ్చింది?
10. పాదరసం ఏ రూపంలో బాగా లభిస్తుంది?
11.పిల్లలలో మరుగుజ్జు లోపం ఎందుకు వస్తుంది?
12.నీటియొక్క రసాయనిక సాంకేతం ఏమిటి?
13.పాలను శుభ్రం చేయుటకు అతిధ్వనులను ఎందుకు ఉపయోగిస్తారు?
14. ఫైలాటలి  అనగా నేమి?
15. నేషనల్ స్టేడియం ఎచ్చట ఉన్నది?
16. M.B.A ను విస్తరించండి?
17. హాలండ్ నుండి అణుబాంబు నమూనాను దొంగిలించి పారివచ్చిన పాకిస్తాన్ శాస్త్రవేత్త ఎవరు?
18. ప్రతాపరుద్ర యశోభూషణం  కావ్యం వ్రాసిన కవి ఎవరు?
19.ఆంధ్ర శివాజి అను బిరుదు ఎవరికి కలదు?
20. భూగోళం పై జలభాగం ఎంత.?
21. భూమిని చేరేసరికి సౌరశక్తిలో ఎంత శాతం వృధా అవుతుంది?
22. అతి తక్కువ లవణీయత గల సముద్రం ఏది?
23. శాంతాఅన్నా అను పవనము ఎక్కడ వీచును?
24. తొలి టాకీ చిత్రం ఇండియాలో ఏది?
25. మెదటి భారతీయ ఐ.సి.యస్  ఆఫీసర్ ఎవరు?
[జవాబులు;1.రామాయణం,మహాభారతం.2.మెసపటొమియా3.తాజ్ మహల్4.లార్డ్ కానింగ్5.ప్యారిస్ 6.1956  7.ప్రధానమంత్రి8.ఉపరాష్ట్ర పతి 9)1962 10.సిన్నబార్ 11.అయోడిన్ లోపం 12.H2O 13.బాక్టీరియాను చంపుటకు14.తపాలా బిళ్ళల సేకరణ15. ఢిల్లీ 16.మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 17.డా.అబ్దుల్ ఖదీర్ ఖాన్18.విద్యానాథుడు19పర్వతనేని వీరయ్య చౌదరి 20. 71% 21. 43% 22.బాల్టిక్ సముద్రము 23కాలిఫోర్నియా 24.ఆలం ఆరా 25.సత్యేంద్రనాథ టాగూర్. ]

Comments

Popular Posts