G.K.క్విజ్-12

1. జలియన్ వాలాబాగ్ లో కాల్పులు జరిపించిన బ్రిటిష్ పోలిస్ అధికారి ఎవరు?
2. సువాసనల ద్వీపము అని దేనికి పేరు?
3. ఉష్ణమండల గడ్డి మైదానాలను ఏమని పిలుచుదురు?
4. ఒక్కొక్క రేఖాంశాన్నిదాటుతూ తిరగడానికి భూమికి ఎంతకాలం పడుతుంది?
5. మనదేశంలో మొదటి జలవిద్యుత్ కేంద్రము ఏ నదిపై నిర్మించారు?
6. ఇండోనేషియా రాజధాని ఏది?
7. సింధు ప్రజలు శివుని ఏ పేరుతో పూజించేవారు?
8. సైన్యసహకార పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
9. భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీయులు ఎవరు?
10. సుభాష్ చంద్ర బోస్ కు రాజకీయ గురువు ఎవరు?
11. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించ బడింది?
12. బానిసత్వాన్ని రాజ్యాంగంలోని ఏ ప్రకరణం నిషేధిస్తుంది?
13. భారత ప్రణాళికాసంఘం ఏ సంవత్సరంలో స్థాపించ బడినది?
14. భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ఏ తేదీన ప్రయోగించారు?
15. మాంసకృత్తులు ఎక్కువగా లభించు గింజలు ఏవి?
16. రక్తంలో ఐరన్ లోపించడం వల్ల వచ్చు వ్యాధి ఏది?
17. డాక్టిలోగ్రఫి అనగా నేమి?
18. గాలిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ధ్వని వేగం ఎంత?
19. చర్మానికి రంగునిచ్చే కణాలు ఏవి?
20. డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు?
21. పల్నాటి వీర చరితము గ్రంథమును వ్రాసిన కవి ఎవరు?
22. బొబ్బిలి వీరుడు ఎవరు?
23. S.L.V  ని విస్తరించుము?
24. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు?
25. ఆధునిక ఒలంపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభించ బడినవి?

[జవాబులు; 1.మైఖేల్ ఒ డయ్యర్ 2.కోర్సికా 3. సవన్నాలు 4) 4 నిమిషాలు 5.కావేరి నది 6.జకార్తా 7.పశుపతి 8.వెల్లస్లీ 9.ఆర్యులు 10.చిత్తరంజన్ దాస్ 11) 24 అక్టోబర్,1945 12.ఆర్టికల్ 23 13) 1950 14) 1975 ఏప్రిల్,19న 15.సోయాబీన్స్ 16.ఎనీమియా 17.వేలిముద్రలను గుర్తించే శాస్త్రము 18) 300 మీ/ సెకన్ 19.మెలనోసైట్స్ 20.జవహర్ లాల్ నెహ్రూ 21.శ్రీ నాథుడు 22.తాండ్ర పాపారాయుడు 23.శాటిలైట్ లాంచ్ వెహికిల్ 24.టంగుటూరి ప్రకాశంపంతులు 25.క్రీ.శ.1896 ]

Comments