G.K. క్విజ్-3

1.మొహంజదారో అంటే  అర్థమేమి?
2.ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ముస్లిం నాయకుడెవరు?
3.జైనుల ప్రధాన గ్రంథాలను ఏమందురు?
4.చార్మినార్ ను నిర్మించిన దెవరు?
5. జాతీయపతాకాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు?
6. షాజహాన్  మొదటిపేరేమి?
7. దక్షిణాఫ్రికా లో గాంధీజీ నడిపిన పత్రిక ఏది?
8. టండ్రా ప్రాంతాలలో ఎక్కువగా ఉండే క్షీరదములు ఏవి?
9.కాలిఫోర్నియాలోని లాస్ఏంజిల్స్ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి?
10. ప్లూటో  గ్రహాన్ని ఏ సంవత్సరం లో కనుగొన్నారు?
11. పెన్సిళ్ళ తయారీలో ఉపయోగపడే ఖనిజం ఏది?
12. గోదావరి నది మొదట తెలంగాణాలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది?
13. రక్తము గడ్డకట్టుటకు ఉపయోగపడు విటమిన్ ఏది?
14. ఏ ఉష్ణోగ్రతలో కోడిగ్రుడ్లు 21 రోజులు పొదగబడును?
15. నాఫ్తలిన్ దేనిలో కరుగును?
16. వైరస్ అను లాటిన్ పదానికి అర్థం ఏమి?
17. కప్ప డింభకము పేరు ఏమి?
18. మొట్టమొదట  తయారైన సూక్ష్మజీవనాశక పదార్థం ఏది?
19. G.I.C ని విస్తరించుము?
20.  20 సూత్రాల ఆర్ధిక ప్రణాళిక ఏ సం; లో ప్రవేశ పెట్టబడింది?
21. సోషలిస్టు సమాజస్థాపన తీర్మానం ను కాంగ్రెస్ పార్టి ఏ సమావేశంలో తీసుకొన్నది?
22. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సం;లో నెలకొల్పబడింది?
23. మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగినవి?
24. ఏసియన్ డ్రామా  గ్రంథకర్త ఎవరు?
25. ఫిరదౌసి  కావ్యఖండిక వ్రాసినదెవరు?
[సమాధానములు; 1.మృతుల దిబ్బ 2.మహమ్మదాలీ జిన్నా 3.అంగాలు 4.మహమ్మద్ కులీ కుతుబ్ షా 5.పింగళివెంకయ్య,1921 6.ఖుర్రం 7.ఇండియన్ ఒపీనియన్ 8. సీల్, వాల్ రస్ 9.సినిమా 10. 1930 11.గ్రాఫైట్ 12.ఆదిలాబాద్ 13.విటమిన్-కె 14. 1020 ఫారన్ హీట్ 15.కిరోసిన్ 16.విషము 17.టాడ్ పోల్ 18.పెన్సిలిన్ 19.జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ 20. 1975  21.ఆవడి 22. 1935  23.ఢిల్లీ  24.గున్నార్ మిర్దాల్ 25. గుర్రం జాషువా]


Comments

  1. GK మీద మీ టపాలు మంచి ప్రయత్నం.
    GK-3 లో 8వ ప్రశ్నలో టుండ్రా ప్రాంతంలో ఎక్కువగా దొరికే చేపలేవి అనే దానికి జవాబుగా సీల్ (seal), వాల్ రస్ (walrus) అన్నారు. కాని అది సరికాదనుకుంటాను. ఎందుకంటే అవి రెండూ mammals వర్గం కింద వస్తాయి. Fish వర్గం వేరు.

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరు చెప్పినది.క్షీరదములు బదులు చేపలు అని వ్రాయడం జరిగింది.మీకు ధన్యవాదములు

      Delete

Post a Comment