G.K. క్విజ్-5

1. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలు ఏవి?
2. F.E.M.A ను విస్తరించుము?
3. కమ్యూనిస్ట్ మేనిపెస్టో  గ్రంథ రచయిత ఎవరు?
4. గద్యతిక్కన అను బిరుదు ఎవరికి కలదు?
5. దేశంలో ఒక సం// లో ఉత్పత్తి అయిన వస్తు,సేవల విలువ మొత్తాన్ని ఏమందురు?
6. ఆంధ్రప్రదేశ్ లో గిరిజన తెగలను అధ్యయనం చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఎవరు?
7. సూర్యరశ్మి నుండి లభించు విటమిన్ ఏది?
8. సముద్రాల లోతును కొలిచే పరికరం ఏది?
9. మానవుడు కనిపెట్టిన మొదటి లోహం ఏది?
10. అల్ప ఉష్ణోగ్రతలో ద్రవంగా మారే గ్యాస్ ఏది?
11. తొలి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు?
12. పొగమంచులో ఫోటోలు తీయడానికి ఉపకరించు కిరణాలు ఏవి?
13. ఇరానీ ట్రోఫి ఏ ఆటకు సంబంధించినది?
14. టిప్పుసుల్తాన్ ను ఓడించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
15. సింధునాగరికత ప్రజల లిపి ఏది?
16. అలెగ్జాండర్ భారతదేశానికి దండెత్తి వచ్చిన సం// ఏది?
17. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిన వాడు?
18. మొదటి పానిపట్టు యుద్ధంలో ఎవరు విజయం సాధించెను?
19. శైవ భక్తులను ఏమందురు?
20. విజయ్ అమృతరాజ్  ఎవరు?
21. సూర్యునికి దగ్గరలో ఉన్న గ్రహం ఏది?
22. యురేషియా లోని గడ్డి భూములకు పేరేమి?
23. ద్రువ ప్రాంతాలలో మంచుచేత నిర్మించే ఇండ్లను ఏమందురు?
24. ఫ్యూజియామా అగ్నిపర్వతము ఏ దేశంలోనిది?
25. ఐర్లాండ్  రాజధాని ఏది?
[జవాబులు; 1.అమెరికా,రష్యా,బ్రిటన్,ఫ్రాన్స్,చైనా 2.ఫారిన్ ఎక్చేంజ్ మేనేజింగ్ యాక్ట్ 3.కారల్ మార్క్స్ 4.కందుకూరి వీరేశలింగం 5.జాతీయాదాయం 6.ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ 7.విటమిన్-డి 8.పాథోమీటర్ 9.రాగి 10. హీలియం, -2690c వద్ద.11.వాలెంతీనా తెరిష్కోవా 12.పరారుణకిరణాలు 13.క్రికెట్ 14.వెల్లస్లీ 15.చిత్రలిపి 16.క్రీ.పూ.327 17.తుళువ 18.బాబర్ 19.నాయనార్లు 20.భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు 21.బుధుడు 22.స్టెప్పీలు 23.ఇగ్లూ 24.జపాన్ 25.డబ్లిన్.]

Comments

Popular Posts