మధుమేహం ( Diabetes)-ఒక అవగాహన



మనం  తీసుకొన్న ఆహారం (పిండిపదార్థం ) గ్లూకోసుగా  మారి రక్తం లో కలుస్తుంది. ఈ రక్తం లోని గ్లూకోసు  శరీరకణములకు చేరినప్పుడే  మనకు శక్తి వస్తుంది. గ్లూకోజ్ శరీరకణజాలానికి  అందాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్  గ్లూకోజ్ తో చర్య జరగాలి. ఈ ఇన్సులిన్ ను పాంక్రియాస్ (క్లోమ) గ్రంథి ఉత్పత్తి చేస్తుంది.
ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగకపోతే  గ్లూకోజ్ శరీర కణాలకు చేరకుండా రక్తములోనే ఉండిపోతుంది. దీనినే మధుమేహం లేదా డయాబెటిస్ అంటారు. దీనినే షుగర్ జబ్బు అనికూడా పిలుస్తారు.
     ఉదయం ఆహారం ఏమీ తీసుకోకుండా ఉన్నప్పుడు రక్తం లో గ్లూకోజ్ 90 నుండి 110 మి.గ్రా.ఉంటుంది.  ఆహారం తీసుకొన్న 2 గంటల తర్వాత 140 మి.గ్రా. వరకు ఉంటుంది.ఇంతకంటే ఎక్కువవుంటే మధుమేహం.,లేదా షుగర్ ఉన్నట్లు.
లక్షణాలు : 1. నీరసం, చిరాకు
             2. అధికంగా  ఆకలి, ఎంతతిన్నానీరసం
             3. బరువు తగ్గిపోవడం ,ముఖం లో జీవకళ తగ్గిపోవడం
             4. అధిక మూత్ర విసర్జన
             5. అధిక దాహం
రక్తం లో 180 మి. గ్రా. కంటే ఎక్కువ గ్లూకోజ్ ఉన్నప్పుడు,
            6. శరీరము పై చీము పొక్కులు, గడ్డలు
            7. గాయాలు త్వరగా  మానకపోవడం
           8. అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు
           9. కంటిచూపు లోపించడం
          10. అతిమూత్రవిసర్జన
          11. జన నేంద్రియాలు దురద , చర్మవ్యాధులు.
ఆహారం: తక్కువ శక్తినిచ్చే ఆహారం ఎన్ని సార్లు తిన్నా ఏమీకాదు.
1.       సలాడ్స్ –దోసకాయ, క్యాబేజీ, ఉల్లిపాయ, టొమాటో, ముల్లంగి, క్యారట్ మొ ;వి.
2.       పాలు, టీ  చెక్కర లేకుండా,
3.       నిమ్మరసం చెక్కర లేకుండా,
4.       పీచు ఎక్కువగావుండే పదార్థాలు మినుములు, పెసలు, కందులు
5.       కూరగాయలు- గుమ్మడి. బీన్స్, కాకర, వంకాయ, పొట్లకాయ, కాలిప్లవర్, క్యాబేజీ, సొరకాయ, మునగ, టొమాటో,దోస,దొండకాయ, బెండకాయ, బీర.
నియమాలు: 1. క్రొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు , వేపుళ్ళు,మసాలాలు, చిప్స్ , బజ్జీలు, నెయ్యి, వెన్న, స్వీట్స్,                      వాడరాదు.
         2. వారానికి 3 గ్రుడ్లు ( పచ్చ సొన లేకుండా ) తీసుకోవచ్చు.
         3. ఉప్పు రోజుకు  5 గ్రా. కంటే మించి తీసుకోరాదు.
         4. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ వాడాలి. దుంపకూరలు వాడరాదు.
         5. బత్తాయి, ఆపిల్, పుచ్చకాయ, జామకాయ, కమలాఫలం, బొప్పాయి,ఉసిరి మితంగా తినవచ్చు.
ఈ షుగర్ జబ్బు   శారీరక శ్రమ లేకుండా హాయిగా తిని కూర్చోనేవారికి ఎక్కువగా వస్తుంది. కొందరికి వంశపారపర్యంగాకుడా రావచ్చు.ఒక సారి వస్తే జీవితాంతము వదిలిపెట్టదు. ప్రారంభ దశలో గుర్తించి, ఆహారానియమాల ద్వారా, క్లోమగ్రంధిని ఉత్తేజపరచే  యోగాసనాల ద్వారాను, నడక, వ్యాయామము ద్వారాను  ఈ జబ్బును నియంత్రించ వచ్చు.
       

             

Comments

Popular Posts