ఆకుకూరల నుండి మనకు లభించే పోషకాలు

1.బచ్చలికూర; ఐరన్-10 మి.గ్రా. పాస్పరస్-35మి,గ్రా.కాల్షియం-200మి.గ్రా.కెరోటిన్-7440 మైక్రో,మి.గ్రా.రైబోప్లోవిన్-0.16మి,గ్రా.విటమిస87మి,గ్రా,కలవు.బచ్చలికూరబుద్ధివికాసాన్నికలిగిస్తుంది,దంతవ్యాధులు.మూలవ్యాధులనుతగ్గిస్తుంది, గడ్డలపై ఆకులు వేసి కడితే త్వరగా తగ్గును,
2.క్యాబేజి ; (మి.గ్రా.లలో) కాల్షియం-39.ఫాస్పరస్-44.ఐరన్-8.విటమిన్--120మై,గ్రా,.రైబోప్లోవిన్-9.విటమిన్-సి-124.కలవు ఇది కడుపులో పుండ్లను,పేగు పూతను తగ్గిస్తుంది.
3.తోటకూర; ఐరన్-3.49,ఫాస్పరస్-23,కాల్షియం-397,విటమిన్--5520మై.గ్రా.,విటమిన్-సి-99,ఫోలిక్ యాసిడ్-149మై.గ్రా.కలవు. ఇది వేడిని తగ్గిస్తుంది.ఆకలిపెంచుతుంది.రక్తవృద్ధికి తోడ్పడుతుంది.
4.పాలకూర : ఐరన్ -16.2,ఫాస్ఫరస్ -30,కాల్షియం -380,కెరోటిన్ (విటమిన్.ఎ)-5862 మై.గ్రా., రైబోప్లోవిన్-0.56,
విట-సి-70. కలవు. జీర్ణశక్తిని పెంచుతుంది,మలబద్ధకాన్నితగ్గించును.రక్తహీనతను తగ్గించును. మూత్రపిండాలవ్యాధి ఉన్నవారు పాలకూరను వాడకపోవడం మంచిది.
5. చింతచిగురు: ఐరన్-5-2,కాల్షియం-101, ఫాస్ఫరస్-140, విట.-250మై.గ్రా., విట.సి-3. కలవు. ఆకుల రసం శరీరానికిచలువచేస్తుంది.బైలియస్ ఫీవర్ ను తగ్గిస్తుంది.
6.చుక్కకూర :ఐరన్-8.7,కాల్షియం-63,ఫాస్ఫరస్-17, విట.-3660మై.గ్రా., రైబోప్లోవిన్-0.06,విట.సి-12,కలవు. దీనిలో ఎక్కువ ఆక్సలేట్స్ వున్నందున కిడ్నీలలో రాళ్ళు ఏర్పడుటకు తోడ్పడును . జీర్ణశక్తిని పెంచి, పైత్యరోగాలు తగ్గించును.
7.గోంగూర: ఐరన్-2.28, ఫాస్ఫరస్-40, కాల్షియం-172, విట.-2872, విట.సి-20. కలవు. ఆకలిని పుట్టిస్తుంది,శక్తిని పెంచుతుంది. దగ్గు,ఆయాసాలను తగ్గించును.
8.కొత్తిమీర : ఐరన్-1.42, కాల్షియం-184, ఫాస్ఫరస్- 71, విట.-6919మై.గ్రా., విట.సి-135. ఇది జీర్ణశక్తిని పెంచును.ఆకుల డికాక్షన్ తాగితే గొంతునొప్పి, పంటినొప్పి, చిగురువాపు తగ్గును. డికాక్షన్ లో పాలు కలిపి తాగితే మొలలవ్యాధి తగ్గును.
9.మెంతికూర: ఐరన్ -16.5, కాల్షియం-395, ఫాస్ఫరస్- 51, విట.-2340మై.గ్రా., విట.కె-22. కలవు. ఇది మధుమేహం ను తగ్గిస్తుంది. మూత్రం బాగజారీచేస్తుంది.
10.పుదీనా: ఐరన్-15.6,కాల్షియం-200, ఫాస్ఫరస్-62, విట.-1620,మై.గ్రా., రైబోప్లోవిన్-0.26, విట.సి-62.కడుపులో పాములను,పురుగులను నశింప జేయును.శ్వాషకోశ వ్యాధులను నయం చేయును.
ఖనిజ లవణాలు-ఉపయోగాలు: -
1.ఐరన్ : రక్తవృద్ధికి ,హీమోగ్లోబిన్ తయారీకి తోడ్పడును. ఎనీమియా రాకుండా ఉండాలంటే రోజుకు 1 నుండి 3 మి..గ్రా.అవసరము.రోజుకు 20 నుండి30 మి..గ్రా. తీసుకొంటే కొంత మాత్రమే శరీరం  గ్రహిస్తుంది. చింతపండు, పసుపు ఎక్కువ వాడడం వల్ల వీటిలోవుండే టానిన్ఐరన్ ఉపయోగపడకుండా చేస్తుంది. ఐరన్ ఎక్కువ ఉండే ఆకుకూరలుకాలిప్లవర్ఆకులు-40.మి..గ్రా,, గలిజేరు-38మమి..గ్రా, ఎర్రతోటకూర-38మమి.గ్రా., డొగ్గలికూర-27మి.గ్రా
2.కాల్షియం: ఎముకల,దంతాల పటిష్టతకు గుండె సంకోచ వ్యాకోచాలకు, గాయాలనుండికారే రక్తం గడ్డకట్టడానికి కాల్షియం తోడ్పడును. ఆక్షలెట్స్  ఎక్కువగా ఉండే తోటకూర, పాలకూర, పప్పుకూర. శరీరానికి  కాల్షియం ను అందకుండా చేస్తాయి. కాల్షియం అధికంగా లభించేవి-ఆవిశకూర-1130మి.గ్రా,,వామింట -881, కుప్పిచెట్టు-667, కరివేపాకు-830 , విటమిన్లకూర-570, మునగాకు-440 మి.గ్రా.లు లభించును.
3. అయోడిన్ : గాయిటర్ వ్యాధి రాకుండా కాపాడును.తల్లిగర్భంలో పిండదశలో అయోడిన్ లోపిస్తే పుట్టెపిల్లలకు బుద్ధి మాంద్యం వస్తుంది. బిడ్డ పెరుగుదల క్షీణిస్తుంది. అయోడిన్ కల్గిన ఉప్పు,  న్యూజిలాండ్ బచ్చలి-50 మి.గ్రా,  అవిశ-2.3మి.గ్రా.అయోడిన్ లభించును.  ఆవాలు,ఆవజాతి కూరలు శరీరానికి అయోడిన్ ను అందకుండా చేయును

Comments

Popular Posts