మతం
మతం
తనకు అర్ధం కాని ప్రకృతి శక్తులకు భయపడిపోయిన మానవుడు ఏర్పరచుకొన్న భావనలే మతం.తనకు తెలియని భయాలనుంచి ఉపశమనం పొందడానికి మనిషి వందల సంఖ్యలో ,అనేక రకాలపేర్లతో దైవాన్ని సృస్టించు కొన్నాడు. పరలోకం ,దేవుడు ,దెయ్యం ,దేవదూతలు మొదలైనవాటిపై నమ్మకం మతం యొక్క మౌలిక లక్షణం .మతం భగవంతుణ్ణిగూర్చి ,ఆయన గుణ గణాలను,శక్తులను, ఆయన దయనుపొందు మార్గమును గూర్చి ఆలోచించే పద్దతి.మతంలో లౌకికాలోచనలకు తావులేదు.
ప్రపంచంలో సుమారు 500 మతాలు ఉన్నా, వాటిలో 10 మతాలు మాత్రమే ముఖ్యమైనవి .
మతంపై వివిధ ప్రముఖుల అభిప్రాయాలు
మతం మూఢాచారాలతోనూ,మూఢవిశ్వాసాలతోనూ నిందివుంటుంది. శాస్త్రసమ్మతము కాని జీవనదృష్టి మతం వెనుకవుంది . ___జవహర్ లాల్ నెహ్రూ
బలహీన మనస్కుల మూఢవిశ్వాసమే మతం __ఎడ్మండ్ బర్క్
ప్రకృతిని గూర్చిన భయమే మత స్తాపనకు దారి తీసింది ____బెట్రాండ్ రస్సెల్
మతం దీనజనోద్దరకన్నా ముఖ్యమైనది కాదు . మతం బాహ్య కర్మకాండలో లేదు ____గాంధీజీ
నా మతం సైన్సే, జీవితాంతం దానినే ఆరాధిస్తాను ___సి. వి. రామన్
దారిద్ర్యాన్ని ,దైన్యాన్ని తొలగించి జాతిని ఉద్దరించునదియే నిజమైన మతం ____స్వామి వివేకానంద
Comments
Post a Comment