క్యాన్సర్ అనగా నేమి? నోటి క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ఎలా?



క్యాన్సరు అనగా నేమి ? నోటి క్యాన్సర్ లేదా ఓరల్ క్యాన్సర్ లేదా మౌత్ క్యాన్సర్ లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.



శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సర్ అని, క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అయితే ఈ క్యాన్సర్ గడ్డలు అన్నీ అపాయం కాదు, కొన్ని మాత్రమే అపాయానికి గురిచేస్తాయి.

    నోటి క్యాన్సర్‌ కేవలం మన అలవాట్ల కారణంగానే వస్తుందంటున్నారు నిపుణులు. పాన్‌పరాగ్‌, గుట్కా, బీటల్‌ నట్స్‌, పొగాకు నమలడం వంటివి నోటి క్యాన్సర్‌కు కారణాలు. నోటి క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించపోతే అది విస్తరించి చెవి, హెడ్‌ అండ్‌ నెక్‌, ఊపిరితిత్తులు, మెదడుకు విస్తరించి మరణం సంభవించే అవకాశలు ఎక్కువ. పాన్‌పరాగ్‌, గుట్కా వంటివి నమలడం ద్వారా వాటిలోని రసాయనాలు నాలుక, దవడ చర్మాలపై ప్రభావం చూపి నోటి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. నోటి క్యాన్సర్ (ఓరల్‌ క్యాన్సర్‌) బాధితుల్లో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు.



శరీరంలో వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో మూడింటొక వంతు నోటి క్యాన్సర్‌ (ఓరల్‌ క్యాన్సర్‌) వస్తుంది. నోటిలో వచ్చే క్యాన్సరు వ్యాధి 50% వరకు 'నాలుక' 'పెదవుల'లో వస్తుంది. మిగతా శాతం నోటిలోపలి బుగ్గ లు (బక్కల్‌ మ్యూకోజా) మృదు అంగుటి భాగం (సాఫ్ట్‌పేలెట్‌) టాన్సిల్స్‌, నాలుక, క్రింద నోటి భాగం, చిగుళ్ళు (గమ్స్‌) మొదలలైన నోటి భాగాలలో వస్తుంది.

నోటి క్యాన్సర్ లో రకాలు :

కాలుతున్న చుట్ట భాగాన్ని (అడ్డచుట్ట) నోటిలో పెట్టుకొని పొగ త్రాగేవారిలోను, సిఫిలిస్‌ వ్యాధి గ్రస్తుల్లోను, అంగుటి భాగా నికి క్యాన్సరు వస్తుంది. అదే పనిగా కిళ్ళీలు జర్ధాకిళ్ళీలు బుగ్గన నిల్వ ఉంచుకొని ఉండే వారిలో బుగ్గ క్యాన్సరు వస్తుంది. పాన్‌ పరాగ్‌, పాన్‌మసాలా, గుట్కావంటి పొగాకు సంంబంధమయిన పొడులు చప్పరించే వారిలో చిగుళ్ళ క్యాన్సరు, గొంతుక్యాన్సరు, బుగ్గ క్యాన్సరు వచ్చే అవకాశం ఉంది. వీటి వాడకం వల్ల శరీరంలో యితరభాగాలు కూడా క్యాన్సరు వ్యాధికి గురికావచ్చు



నోటి క్యాన్సర్ లక్షణాలు :దవుడలోని పళ్ళు విరిగిపోయినా, అరిగి పోయినా

దవుడలోని పళ్ళు విరిగిపోయినా, అరిగి పోయినా అవి తరచుగా బుగ్గకు, నాలుకకు, పెదవులకు గుచ్చుకొని పుండుగా మారి ఆ పైన క్యాన్సరు వ్యాధిగా మారవచ్చు.

  నోటి క్యాన్సర్ లక్షణాలు :పళ్ళు లేనివారు ఉపయోగించే కట్టుడు పళ్ళు

పళ్ళు లేనివారు ఉపయోగించే కట్టుడు పళ్ళు సరిగా కుదరక నోటిలోని సున్నిత భా గాల పై వత్తిడి తెచ్చే పరోస్థితిలోను, వంకర పళ్ళు సరిచేసే విషయంలో నోటిలోని సున్ని త భాగాలు పుండ్లుగా మారి ఆ తర్వాత క్యాన్సరుగా మారే అవకాశం ఉంది.





నోటి క్యాన్సర్ లక్షణాలు: నోటిలో వచ్చే 'సబ్‌- మ్యూకస్‌ఫైబ్రోసిస్‌'

నోటిలో వచ్చే 'సబ్‌- మ్యూకస్‌ఫైబ్రోసిస్‌', 'ల్యూకోప్లేకియా', 'లైకన్‌ ప్లాసస్‌', 'సిలిఫిలిస్‌' పంటి వ్యాధులను నిర్లక్ష్యం చేసినా అవి క్యాన్సరుగా మారు తాయి.

నోటి క్యాన్సర్ లక్షణాలు: నోరు లేదా గొంతు బాగంలో వాపు

నోరు లేదా గొంతు బాగంలో వాపు, సలుపు, కణుతులు, మందపాటా ప్యాచెస్ వంటి లక్షణాలు కూడా క్యాన్సర్ గా మారుతాయి.

    నోటి క్యాన్సర్ లక్షణాలు: గొంతులో ఆహారపానియాలు మింగలేకపోవడం

గొంతులో ఆహారపానియాలు మింగలేకపోవడం, లేదా ఏదో ఇరుక్కున్నట్లుగా అనిపించడం కూడా క్యాన్సర్ లక్షణమే.

నోటి క్యాన్సర్ లక్షణాలు: గొంతులో ఆహారపానియాలు మింగలేకపోవడం

నోరు మరియు గొంతు వాపుతో పాటు అసౌకర్యంగా లాలాజల మింగడానికి కూడా కష్టంగా ఉండటం క్యాన్సర్ లక్షణం


నోటి క్యాన్సర్ లక్షణాలు: నోట్లో, గొంతు, నాలుకలో

నోట్లో, గొంతు, నాలుకలో తిమ్మెర్లుగా స్పర్శలేకుండుట, నొప్పిగా ఉండటం, సలపడం, వంటి లక్షణాలు కనబడుతాయి.


నోటి క్యాన్సర్ లక్షణాలు: చెవి బాగానే వినపడుతుంటుంది

చెవి బాగానే వినపడుతుంటుంది, కానీ నొప్పి క్రమక్రమంగా ఎక్కువగా పెరుగుతుంది.


నోటి క్యాన్సర్ లక్షణాలు: దవడలు కదిలించలేకపోవడం

దవడలు కదిలించలేకపోవడం, ఆహారాన్ని నమలడానికి, మింగడానికి ఇబ్బంది పడటం, మాట్లాడటానికి ఇబ్బంది పడటం.

నోటి క్యాన్సర్ లక్షణాలు: ఎలాంటి కారణాలు లేకుండా దంతాలు వదులవ్వడం

ఎలాంటి కారణాలు లేకుండా దంతాలు వదులవ్వడం వంటి లక్షణాలు కనబడుతాయి.

నోటి క్యాన్సర్ కు మరికొన్ని లక్షణాలు

త్వరగా తగ్గని నోటిలోని పుండ్లు, విపరీత మయిన నొప్పి, వాచిన లింపు గ్రంధులు, లాలాజలం అధికంగా ఊరడం, నోటి దుర్వాసన, నోరు తెరవలేని పరిస్థితిలో మూసుకు పోవడం వంటి లక్షణాల ద్వారా క్యా న్సరు వ్యాధిని గుర్తించ వచ్చు.




   

Comments

Popular Posts