బట్టతలతో బాధపడే వారికి శుభవార్త..


 అందుబాటులోకి కొత్త టెక్నాలజీ.

 

Bald Head Treatment: ప్రస్తుత కాలంలో చాలా మంది బట్టతల సమస్యతో బాధపడుతుంటారు. అంతేకాకుండా వయసుతో తారతమ్యం లేకుండా చాలా మందిలో ఎక్కువగా జుట్టు రాలిపోవడం వల్ల బట్టతల వస్తుందేమోననే ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. అయితే బట్టతలకు మందులు లేవని బాధపడే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..




ప్రస్తుత జీవన విధానంలో ఎక్కువగా పని మీద శ్రద్ధ పెరగడంతో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నారు. అంతేకాకుండా వాటి గురించి ఆలోచించే అంత సమయం కూడా ఉండటం లేదు. అయితే ఎక్కువ మందిలో సాధారణంగా కనిపించే సమస్య జుట్టు రాలిపోవ‌డం ( Hair Fall). క‌ళ్లముందే జ‌ట్టు రాలిపోయి బ‌ట్ట‌త‌ల ( bald head )వ‌స్తుంటే ఎంత‌గానో బాధిస్తుంది. కొంత మందికి చిన్న వయస్సులోనే జట్టు రాలుతుంటుంది. 

ఇలా జుట్టు రాలిపోకుండా ఇప్పటికే చాలా రకరకాల ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. అయితే ఇప్పటికి నుంచి అలాంటి ఏ చిట్కలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దానికంటూ ఓ టెక్నాలజీ వచ్చింది. సాధారణంగా సైన్స్ ప్రకారం చూస్తే బట్టతల అనేది మాన‌వ జన్యువుల్లోని బాల్డ్‌నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కార‌ణంగా వస్తుంది. వెట్రుకలు రాలిపోవడానికి ప్రధాన కారణం మనిషి తీవ్ర ఒత్తిడితో ఉండటం, పోషకాహార లోపం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది.  


ఇక మ‌హిళ‌ల్లో మెనోపాజ్‌, గ‌ర్భ‌ధార‌ణ త‌దిత‌ర స‌మ‌యాల్లో హార్మోన్ల విడుద‌లలో వ‌చ్చే మార్పు వ‌ల్ల కూడా వెంట్రుక‌లు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా.. మ‌హిళ‌ల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగ‌ర్‌, ఆర్థ‌రైటిస్ వంటి వ్యాధుల‌కు వాడే మందుల వ‌ల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది. 

ఒక్కసారి బట్టతల వచ్చిందంటే, తలమీద జుట్టు తెప్పించడం హరిహరాదులకైనా అసాధ్యమే. దీంతో, అకాలపు బట్టతలతో బాధపడేవారు జుట్టు మీద ఆశలు వదిలేసుకుంటారు. ఇన్నేండ్లు బట్టతలపై జుట్టు రావడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. 


కానీ నీరీక్షణకు తెర వేస్తూ.. కొత్త టెక్నాలజీని కనుకున్నారు శాస్త్రవేత్తలు. ఎలా అంటే.. కుదుళ్ల ప్రాంతానికి నానో కణాలను పంపి, వెంట్రుకలు మొలిచేలా చేయవచ్చని తేలిపోయింది. ఈ ఫార్ములా ప్రకారం ఎలుకలపై నిర్వహించిన ప్రాథమిక ప్రయోగం విజయవంతమైందని అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ పరిశోధకులు చెబుతున్నారు. 

జుట్టు రాలే ప్రక్రియను ‘ఆండ్రోజెనిక్‌ అలొపేసియా’ అంటారు. వాడుక భాషలో బట్టతలగా పిలుస్తాం. దీనికి ముఖ్యకారణం మాడు భాగానికి పోషకాలను సరఫరా చేసే ఫాలికల్స్‌ చుట్టూ రక్తనాళాలు లేకపోవడమే. దీనికితోడు వెంట్రుకలు పెరిగేందుకు, కొత్తవి పుట్టుకొచ్చేందుకు తోడ్పడే కణాలు చనిపోతూ ఉంటాయి. ఈ అవరోధాలకు చెక్‌ పెట్టేందుకు పరిశోధకులు నానో కణాలను ప్రయోగిస్తున్నారు. ఇక బట్టతల ఉన్నవారి సమస్య తీరినట్లే. 

Comments

Popular Posts