దనపు బరువును తగ్గించే యోగాసనాలు

·         యో, వ్యాయామ రూపం కంటే ఎక్కువ; ఇది ఒక జీవన మార్గం.

·        
క్రమం తప్పకుండా యోగా చేసేవారు వ్యాధి నిరోధకతను అధికంగా కలిగి ఉంటారు.
·         యోగ క్యాన్సర్ రోగులకు కూడా సహాయపడుతుందని గమనించడం జరిగింది.
·         వారంలో మూడుసార్లు వ్యాయామాలు లేదా నడవటం వలన ఆరోగ్యంగా ఉంటారు.
చాలా మంది ఆరుబయట గడపడం లేదా తక్కువ మొత్తంలో కాలినడక కోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కుర్చీల్లో కూర్చొని సమయాన్ని గడుపుతున్నారు; అలా ఉండడం ద్వారా బరువు పొందటానికి గల వేగాన్ని పెంచడానికి సన్నద్ధమవుతోంది. "అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్" వారు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో, "బరువును కోల్పోవడం కొనసాగించడం లేదా సాధారణ బరువును సాధించడానికి సంభావ్యత తక్కువగా ఉంటుంది." అని సూచించడం జరిగింది.

ఒక నిశ్చల జీవనశైలి కాకుండా, అనేక కారకాల వలన కూడా బరువు పెరగడం జరుగుతుంది, అధిక మోతాదులో కేలరీలు కలిగిన చిరుతిళ్ళు అంటే ఇష్టం కలిగి ఉండడం మరియు వ్యాయామం చేయడం చాలా వరకు తగ్గించడం వంటివి కారణాలు కావచ్చు. పలువురు నిపుణులు ఒక వారానికి మూడుసార్లు 30 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం సాధన చేయడం లేదా రోజువారిగా 5000 అడుగుల కాలినడక సాధారణ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని సూచించారు; అయితే, పెరిగిన
కాలుష్యం కారణంగా బయట వెళ్ళడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని అర్థమవుతుంది. ఇలాంటి సమయాలలో శతాబ్దాల కాలం నాటి 'యోగా' తెర మీదికి రావ
యోగ వ్యాయామ రూపం కంటే ఎక్కువ; ఇది ఒక జీవన మార్గం, మరియు క్రమం తప్పకుండా యోగా చేసేవారు అధిక వ్యాధి నిరోధకతను కలిగి ఉంటారు, మరియు యోగా క్యాన్సర్ రోగులకు కూడా సహాయపడుతుంది అని గమనించడం జరిగింది. జానైస్ కియోకల్ట్-గ్లాసర్", 'ఒహియో స్టేట్ యూనివర్శిటీ' మానసిక మరియు మనస్తత్వ ప్రొఫెసర్ నేతృత్వంలోని అధ్యయనాల, మరియు "జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ప్రచురణలప్రకారం, పరిశోధకులు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 200 మంది ఇంతకుముందు యోగ సాధన చేయనటువంటి రోగులను పరిశీలించడం జరిగింది. సగం సమూహం వారు, యోగాను పట్టించుకోకుండా కొనసాగగా, మరో ఇతర సగం వారు డివిడిల సహాయంతో వారానికి రెండుసార్లు, 90 నిమిషాల తరగతులను 12 వారాల పాటు ఇంట్లోనే సాధన చేయడం జరిగింది. మూడు నెలల తర్వాత చికిత్స ముగిసే సమయానికి యోగా సాధన చేసిన సమూహం వారు తక్కువ అలసటను మరియు శక్తి అధిక స్థాయిలను కలిగి ఉన్నట్లుగా నివేదించారు.

కావాల్సిన వస్తువులు: యోగ మ్యాట్ లేదా కార్పెట్

అనుసరించాల్సిన విధానం: సాధారణంగా కనీసం వారానికి 3 సార్లు, ప్రతి ఒక భంగిమలో 3 నుండి 5 లోతైన శ్వాసలను తీసుకుంటూ సాధన చేయాలి, . ప్రతి ఒక్క వ్యాయామాన్ని దానిలోని ప్రధాన భంగిమను సాధన చేస్తూ ప్రారంభించండి. ఇది కష్టంగా అన్పిస్తే, సులువైన విధంగా మార్చికోండి. ఫలితాలను వేగంగా పొందాలి అనుకుంటే, ప్రతి భంగిమలో 5 నుండి 8 శ్వాసలను తీసుకుంటూ, పునరావృత్తుల సంఖ్యను పెంచుకోవాలి.


సేతు బంధ్


వీపును నేలకు ఆనించి పడుకోవాలి.  మరియు పాదాలు నేల మీద విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మోకాళ్ళను వంచాలి. పాదాలు మరియు పిరుదుల మధ్య దూరం చేతులకు సమాంతరంగా ఉండేట్లుగా నిర్ధారించుకోండి మరియు ఇపుడు శరీరాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. ఈ విధంగా 5 నుండి10 సార్లు సాధన చేయడానికి ప్రయత్నించండి & తరువాత యధాస్థానానికి వచ్చేయండి.


శల్బాసన


నుదురు మరియు గదవ భాగాలు నేలపై మరియు చేతులు తొడల క్రింద విశ్రాంతి తీసుకుంటునట్లుగా ఉంచి కడుపు పై పడుకొని ఆసనాన్ని ప్రారంభించండి. తర్వాత, ఎడమ కాలును నేరుగా ఉంచి, 10 అంగుళాలు వరకు పైకి ఎత్తడానికి ప్రయత్నించండి, కానీ మోకాలు వంగకుండా ఉందో నిర్ధారించుకోండి. ఆ తరువాత, కుడి కాలును కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నించండి మరియు చివరగా, ఇదే విధంగా రెండు కాళ్లతో చేయండి.                       
చక్కి చలనాసన

ఇది కడుపులోని కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడే ఒక శక్తివంతమైన వ్యాయామం. దీని కోసం, మీరు సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోవాలి & మీ రెండు కాళ్లు ఒకదానితో ఒకటి ఆనించుకుంటూ మీ ముందుకు నేరుగా చాపాలి. అయితే, మోకాళ్ళు వంచి లేవు అని నిర్ధారించుకోండి. తరువాత రెండు చేతులను ఒకదానితో ఒకటి జోడించుకోవాలి & కాళ్ళ మీద నుండి వృత్తాకారంగా కదుపుతూ త్రిప్పాలి.ఈ విధమైన చలనాలను సవ్య దిశలో 10 సార్లు & అప సవ్య దిశలో 10 సార్లు త్రిప్పాలి మరియు ఆ తర్వాత ఆసనం నుండి నెమ్మదిగా విడుదల కావాలి.


నౌకచలనాసన


నేరుగా సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోవాలి మరియు కాళ్లని ఒకదానితో ఒకదాన్ని ఆనించి నేరుగా మీ ముందుకు చాపండి. మళ్లీ, మోకాళ్ళను వంచకుండా మరియు చేతులను శరీరంకు ఇరువైపులా ఉంచండి. ఇప్పుడు చేతులను ముందుకు & వెనుకకు కదపడానికి ప్రయత్నించండి. అలాగే, చేతులు కదులుతున్న పద్ధతిలోనే శరీరం కూడా కదపాలి. ఒక పడవను నడుపుతున్న విధంగా కదలాలి. ఈ విధంగా సవ్య దిశలో 10 సార్లు మరియు అపసవ్య దిశలో 10 సార్లు పునరావృతం చేయాలి మరియు ఆ తర్వాత ఆసనం నుండి నెమ్మదిగా విడుదల కావాలి.


ధనురాసన


సాధారణంగా దీనిని బో పోజ్ అని పిలుస్తారు. ఇందులో మీరు చేయాల్సిందల్లా నేల పై కడుపును ఆనించి పడుకోవాలి మరియు ఛాతికి ఇరువైపులా చేతులను ఉంచాలి. ఆ తర్వాత, ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి మరియు కాళ్లను & తొడలను పైకి ఎత్తాలి. అదే సమయంలో, చేతులతో కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇదే భంగిమలో కనీసం 30 సెకన్ల పాటు నిలిచి ఉండడం మంచిది & ఆ తర్వాత ఆసనం నుండి నెమ్మదిగా విడుదల కావాలి.

యోగ అనేది బరువును తగ్గించుకోవడానికి గల మార్గాలలోని జిమ్మింగ్ మరియు పరిగెత్తడంల కంటే సులభతరమైనది, దీని కోసం ప్రజలు అధిక ఓర్పు స్థాయిలను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాక, దీనిని మీ ఇంట్లోని సంబంధిత పరిధులలోనే సాధన చేయవచ్చు మరియు క్లిష్టమైన అమరికలు లేదా మరియేతర ఇతర రకాల విస్తృతమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. మరియు ఇందులోని ఉత్తమ విషయం ఏంటంటే, దీనిని ప్రతి ఒక్కరూ, వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబంలోని చిన్న, పెద్ద వాళ్ళు అందరూ కలిసి సాధన చేయవచ్చు మరియు దీనితో ఒక ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవనశైలిని అవలంభిస్తూ ముందుకు సాగవచ్చు.



Comments

Popular Posts