B.P [రక్తపోటు ] ఎందుకు వస్తుంది?




        గుండె  లోంచి  రక్తం  రక్తనాళాల్లోకి కొంత పీడనం తో, నియమిత వేగముతో ప్రవహిస్తుంది. ఈ పీడనము(ఒత్తిడి ) ఏ కారణము చేతనైనా  పెరిగితే  దానిని రక్తపోటు లేదా  బీ. పీ ( బ్లడ్ ప్రెషర్ ) అంటారు.
రక్తపోటుకు  కారణాలు : 1.రక్తనాళికల లోపల రక్తం ప్రవహించే  మార్గం సన్నబడిపోవడం.
                2. రక్తం చిక్కబడిపోవడం.
                3. గాయాలవల్ల  అధికరక్తస్రావం జరిగినప్పుడు రక్తం ఉండవలసినదాని కంటే తక్కువ ఉంటే B.P                    తగ్గిపోతుంది. దీనిని  హైపో టెన్షన్ అంటారు. వాంతులు, విరేచనాలు,అధికచెమవల్ల వంట్లోని      నీరు బయటకు పోయి రక్తం చిక్కబడి  కూడా  B.P పడిపోతుంది. ఇది తాత్కాలికం.
               4. వంశపారంపర్యం
               5. మానసిక కారణాలు.
               6. స్థూల కాయం, శారీరక శ్రమ లేకపోవడం
               7. ధూమపానం ,ఉప్పు ఎక్కువగా వాడడం
             8. మూత్రపిండాలు మూత్రపిండాలు రెనిన్ అనే  హార్మోన్ను , యాంజియోటెన్సిన్  అనే పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ పదార్థం రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచ  శక్తిని క్రమబద్ధం చేసి, నియమిత వేగం తో శరీరమంతా రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. మూత్రపిండాలు చెడిపోతే , రక్తనాళాలు సంకోచించి మూసుకు పోతాయి. దానివల్ల రక్తపోటు పెరుగుతుంది.
             9. రక్తం లో ఎర్ర రక్త కణాలు  ఎక్కువగావుంటే కూడా రక్తం చిక్కబడి  బి.పి పెరుగుతుంది.
బి.పి  లక్షణాలు: 1. తలనొప్పి,  మేడమీదకు,  తలవెనుకభాగాన లాగుతున్నట్లు పోటు,
                    2. నడుస్తుంటే తల నరాలు అదిరినట్లు ఉండడం.
                   3.  కంటిచూపులో మార్పు
                   4.  తల దిమ్ముగా  ఉండడం, ఏదో బరువు పెట్టినట్లు ఉండడం  
                   5. తల తిరగడం, కళ్ళు ఎర్రబడడం.
బి.పి ని  కొలుచుట : సాధారణ రక్తపోటు  120/80 M.M.H.G  ఉంటుంది.  దీనిలో 120 అనేది సిస్టోలిక్  ప్రెషర్ ను సూచిస్తుంది. 80 అనేది  డయస్టోలిక్ ప్రెషర్ ను సూచిస్తుంది. గుండె కుంచించి నప్పుడు రక్తం దమనుల్లోకి  పంప్ చేయబడినప్పుడు కల్గిన ఒత్తిడిని సిస్టోలిక్ ప్రెషర్  అంటారు.
     సిరలలోనుండి రక్తాన్ని  గ్రహించడానికి గుండె విచ్చుకోవడాన్ని లేదా వ్యాకోచించ డాన్ని డయ స్టోలిక్ ప్రెషర్  అంటారు.
బి.పి వయస్సుని బట్టి మారుతుంది.
వయస్సు                     సిస్టోలిక్ ప్రెషర్                    డయ స్టోలిక్ ప్రెషర్      
10 సం.                           100                                 65
20 సం.                          118                                  78
25 సం.                          120                                 80
50 సం.                          133                                 90 

Comments

Post a Comment

Popular Posts